KCR | శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స (hip bone replacement surgery) విజయవంతమైన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో బీఆర్ఎస్ అధినేత మెల్లగా అడుగులు వేశారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స (hip bone replacement surgery) విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో బీఆర్ఎస్ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని కాంక్షిస్తున్నారు.
శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని యశోద వైద్యులు తెలిపారు. త్వరితగతిన కోలుకునేందుకు అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని చెప్పారు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు సీటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయంత్రం కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు.
Also Read..
Assembly Session | ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
BRS | గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Akbaruddin Owaisi | ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

