హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో వారు తమ జన్మదినం సందర్భంగా కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.