KCR | బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్‌లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనల్లో కేసీఆర్ పాల్గొంటారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ ఆఫీసు నుంచి సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు.