KCR | చేవెళ్ల నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం.. పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్న కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా శనివారం ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు.
- నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ
- రంగారెడ్డి జిల్లా నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ
- కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్ అధినేత
KCR | రంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా శనివారం ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తుచేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నట్టు తెలుస్తున్నది. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్‌కు ముందు నుంచే దూకుడుగా
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు. చేవెళ్లతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు ఉన్న అనుబంధంతో కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అధినేత కేసీఆర్ అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. అందరి నేతల ఏకాభిప్రాయం మేరకు చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను వ్యూహాత్మకంగా బరిలో ఉంచారు. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుసటి రోజు నుంచే కాసాని జ్ఞానేశ్వర్ నియోజకవర్గాల వారీగా సమావేశాల్లో పాల్గొనడమేకాకుండా ముఖ్యనేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ సమావేశాల్లో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. కాసాని గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిస్తున్నారు.
కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి
చేవెళ్ల వేదికగా కేసీఆర్ చేయనున్న ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పాలనలో నెలకొన్న కరువు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్రచారసభలో కాంగ్రెస్‌తోపాటు విభజన హామీలను అమలు చేయక, రాష్ర్టానికి ప్రాజెక్టులేవీ ఇవ్వక వివక్షను చూపిన బీజేపీని నిలదీసేలా కేసీఆర్ ప్రసంగం సాగునున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందాలను ప్రజలకు వివరించడంతోపాటు గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన తీరును పోల్చిచూసి లోక్‌సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ఈ వేదికపై నుంచి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల తీరుపై ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు కర్తవ్యబోధ చేయనున్నట్లు సమాచారం. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ జనరంజక పాలనను ప్రస్తావిస్తూనే.. తెలంగాణ పట్ల తనకున్న భావోద్వేగ బంధాన్ని ఆవిష్కరించి ప్రజలను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

