హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. సోమవారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీనివాస్‌రావు నివాసంలో నిర్వహించిన దశ దినకర్మకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కొద్దిసేపు మాట్లాడి ఓదార్చారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి,
నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, తాటిపర్తి జీవన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మండలి విప్ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, వాణీదేవి, శంభీపూర్‌రాజు, గోరటి వెంకన్న, నవీన్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, యాదవరెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మర్రి రాజశేఖర్, అనిల్‌జాదవ్, చింత ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, పార్టీ పార్లమెంటరీ మాజీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, గ్యాదరి కిశోర్, గెల్లు శ్రీనివాస్, తుల ఉమ, చింతల విజయశాంతి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
బావమరిది శ్రీనివాసరావు దశదినకర్మకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంపల్లికి వస్తున్నారనే విషయం తెలుసుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ తన మనుమడు హిమాన్షుతో కలిసి కారులో మధ్యాహ్నం కొంపల్లిలోని శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు.