హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తన ఎర్రవల్లి నివాసంలో సమావేశమయ్యారు. వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక ఏర్పాట్లపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ రజతోత్సవ సంబురాల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, డీ సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, జయసింహ, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నగేశ్, నాయకులు నివేదిత సాయన్న, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు కూడా పాల్గొన్నారు.