KCR : అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి మృతికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రారంభం నుంచి పార్టీకి నాగమణి చేసిన సేవలను, వారి ఉద్యమ కృషిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. నాగమణి మరణంతో శోకతప్త హృదయులైన ఆమె కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.