KCR | పోరుబాట రూటు ఖరారు.. 24 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్‌షో
పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
- తెలంగాణ అంతటా యాత్ర.. 17 రోజుల షెడ్యూల్ విడుదల
- ప్రతి రోజూ రోడ్డు షో ముగిసిన పట్టణంలోనే రాత్రి బస
- సిద్దిపేటలో బహిరంగసభ.. అన్ని ప్రాంతాల్లో రోడ్‌షోలు
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30-6 గంటలకు ఒక పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, రాత్రి 7.30 గంటలకు మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఒకటి రెండుసార్లు మినహా కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరాక, 17 రోజులపాటు ఆయన రోడ్‌షో నిర్వహించిన పట్టణంలోనే బసచేసేవిధంగా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనుసరించే వ్యూహాన్నే (2014, 2018, 2023 ఎన్నికల సమయంలో మినహా) ఈసారి పాటించనుండటం విశేషం. ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా రోడ్‌షోలు నిర్వహించి ప్రజాచైతన్యాన్ని కూడగట్టినట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ సమీకరించేలా ముమ్మర ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్క సిద్దిపేటలో బహిరంగసభ మినహా మిగితా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు.

దగ్గరకానున్న దూరాలు
పదేండ్లపాటు అధికారంలో ఉండటం వల్ల పార్టీ అధినేతను కలుసుకోలేకపోయామనే పార్టీ శ్రేణులకు, ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి నడిచిన ఉద్యమసహచరులు, మేధావులతో కేసీఆర్ కరచాలనం చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించారని పార్టీ వర్గాలు చెప్పాయి. అందులో భాగంగానే కేసీఆర్ బస్సుయాత్ర ద్వారా ఆ రోజు రోడ్‌షో ముగిసిన అనంతరం అదే పట్టణంలో బసచేసి, ఆ మరుసటి రోజు అందరినీ కలవటమే కాకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్‌ను రూపొందించడం విశేషం. తద్వారా ఇటు పార్టీ శ్రేణుల్లో, సమాజంలోని వివిధ వర్గాల్లో ‘కేసీఆర్ మాకు దూరం అయ్యారు’ అనే అపోహను పోగొట్టి అన్ని వర్గాలకు దగ్గర కానుండటం మరో విశేషం. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే రోడ్‌షోల కోసం బస్సు, రోడ్‌షో వాహనాలు సిద్ధం అయ్యాయి.
సీఈవోకు బీఆర్ఎస్ వినతి
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చేపట్టనున్న బస్సుయాత్రకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సీఈవో వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి చేసింది. శనివారం బీఆర్కేఆర్ భవన్లో సీఈవోను ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ ఎల్ రమణ, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
కేసీఆర్ రోడ్‌షో షెడ్యూల్
ఏప్రిల్ 24 మిర్యాలగూడ, సూర్యాపేట (సూర్యాపేటలోనే బస)
ఏప్రిల్ 25 భువనగిరి రోడ్‌షో (ఎర్రవల్లిలో బస)
ఏప్రిల్ 26 మహబూబ్‌నగర్ (అక్కడే బస)
ఏప్రిల్ 27 నాగర్‌కర్నూల్
ఏప్రిల్ 28 వరంగల్ రోడ్‌షో (వరంగల్‌లోనే బస)
ఏప్రిల్ 29 ఖమ్మం రోడ్‌షో (అక్కడే బస)
ఏప్రిల్ 30 తల్లాడ, కొత్తగూడెం (కొత్తగూడెంలో బస)
మే 1 మహబూబాబాద్ (వరంగల్‌లో బస)
మే 2 జమ్మికుంట (వీణవంకలో బస)
మే 3 రామగుండం (అక్కడే బస)
మే 4 మంచిర్యాల (కరీంనగర్లో బస)
మే 5 జగిత్యాల (అక్కడే బస)
మే 6 నిజామాబాద్ (అక్కడే బస)
మే 7 కామారెడ్డి, మెదక్ (మెదక్‌లో బస)
మే 8 నర్సాపూర్, పటాన్చెరు (ఎర్రవెల్లిలో బస)
మే 9 కరీంనగర్ (అక్కడే బస)
మే 10 సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభ (హైదరాబాద్‌లో బస)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- bus yatra
- CEO Vikasraj
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

