KCR birthday : బీఆర్ఎస్ పార్టీ అధినేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. హరితసేన సిద్దిపేల జిల్లా ఇన్జార్జి చెప్యాల రాజేశ్వర్రావు ఒక పాటను రూపొందించారు. ‘చింతమడక కన్న చిరుతపులినీ జూడూ.. శివమెత్తి దుంకింది నాడూ’ అన్న పాటను గాయకుడు మానుకోట ప్రసాద్ రాశారు.
మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ కలిసి పాడారు. ఈ పాటకు మదీన్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో చెప్యాల రాజేశ్వర్రావు ఈ పాటను రూపొందించారు. ఉద్యమ నాయకుడు, పరిపాలకుడిగా కేసీఆర్ సాధించిన ఘనతను ఈ పాటలో వర్ణించారు. కింది వీడియోలో ఈ పాటను మీరు కూడా చూడవచ్చు..
స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. చెప్యాల రాజేశ్వర్ రావు (CRR) రూపొందించిన పాట.
లిరిక్స్: మానుకోట ప్రసాద్
సింగర్: మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్
మ్యూజిక్: మదీన్#HappyBirthdayKCR Sir pic.twitter.com/O6qCk7wvPN— BRS Party (@BRSparty) February 16, 2026