కేసీఆర్ శ్రీరాముడిగా.. రావణుడిగా రేవంత్!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ గ్రౌండ్స్‌లో దసరా పండుగ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన ‘శ్రీరాముడిగా కేసీఆర్.. రావణుడిగా రేవంత్‌రెడ్డి’ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శ్రీరాముడి ఆదర్శాలతో పోల్చుతూ ఏర్పాటుచేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- దసరా వేళ సీతారాంబాగ్‌లో ప్రత్యేక కటౌట్లు
- ఆసక్తిగా వీక్షించిన హైదరాబాద్ నగరవాసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ గ్రౌండ్స్‌లో దసరా పండుగ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన ‘శ్రీరాముడిగా కేసీఆర్.. రావణుడిగా రేవంత్‌రెడ్డి’ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శ్రీరాముడి ఆదర్శాలతో పోల్చుతూ ఏర్పాటుచేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన అందించిన పాలనా దక్షతను ఆయన అభిమానులు ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే సందర్భంలో కటౌట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రావణుడిగా రూపొందించడం గమనార్హం. ఈ వేడుకకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

