మాగనూరు, నవంబర్ 2 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. శనివారం చెక్‌పోస్టు వద్ద కర్ణాటక నుంచి లారీలో ధాన్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు లారీ డ్రైవర్‌ను వివరాలు అడగగా.. కొత్త నాటకానికి తెరలేపాడు. మక్తల్ మండలంలోని రైస్‌మిల్లు నుంచి ధాన్యాన్ని కర్ణాటకకు తరలించానని.. అక్కడ వడ్లను తిరస్కరిస్తే రైస్‌మిల్లులో దింపేందుకు తిరిగి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో పోలీసులు లారీని వెనక్కి పంపించారు.