హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): జూరాలకు వరద ప్రవాహంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టులో కర్నాటకకు 16టీఎంసీలు కేటాయించడం తగదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్రజలశక్తిశాఖ ఆధ్వర్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ 38వ వార్షిక సమావేశం గురువారం నిర్వహించారు.
లింక్ ప్రాజెక్టులో తెలంగా ణ ప్రయోజనాలను కాపాడాలని, లింక్ద్వా రా తరలించే 148 టీఎంసీల్లో 50శాతం అంటే 74టీఎంసీలను తమకే కేటాయించాలని అధికారులు నొక్కిచెప్పారు. కృష్ణాబేసిన్ అవతలికి ఏపీ కృష్ణా జలాలను పెద్దమొత్తం లో మళ్లిస్తున్న నేపథ్యంలో మరింత లోటు ఏర్పడుతున్నదని తెలిపారు. మరోవైపు తె లంగాణలోని కృష్ణా పరీవాహకంలో అనేక కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయని, వాటి కి భరోసా ఇవ్వాల్సిన అవసరమున్నదని తెలిపారు. సీఆర్ పాటిల్, కేంద్రజలశక్తిశాఖ కార్యదర్శి దేబార్ శ్రీ ముఖర్జీ, ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ బాలేశ్వర్ ఠాకూర్ పాల్గొన్నారు.