యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్టు సత్రం కార్యదర్శి డాక్టర్ ఎన్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు వంద సంవత్సరాలుగా పాఠశాలలు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్న కరివెన సత్రం దినదినాభివృద్ధి చెందుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో అన్న సత్రం ప్రారంభించడం గొప్ప విషయంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సొంతంగా స్థలం సేకరించి కొత్త భవన నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.