G20 Summit | కరీంనగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్‌లోని ఫిలిగ్రీ సొసైటీ రూపొందించింది. వెండితో ప్రత్యేకంగా అల్లిన వీటిపై జీ20 అనే అక్షరాలు బంగారు వర్ణంలో చెక్కించారు.

ఇలాంటివి 200 బ్యాడ్జిలు తయారు చేసినట్టు ఫిస్కా ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్ తెలిపారు. అతిథులకు జ్ఞాపికలుగా అందించేందకు 100 నెమలి ప్రతిమలను కూడా రూపొందించారు. దీంతోపాటు కరీంనగర్ ఫిలిగ్రీకి జీ20 సదస్సులో స్టాల్ ఏర్పాటు చేసే అవకాశం సైతం లభించింది.