కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 19: రాఖీ అంటేనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ప్రేమతో కూడుకున్న పెద్ద పండుగ. తన సోదరులకు రాఖీ కట్టాల్సిన ఆ అధికారిణి ఈరోజు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ పండుగ జరుపుకోలేదు. ఆమెది పెద్ద కుటుంబం. చాలా మంది అన్నాదమ్ముళ్లు ఉన్నారు. అయినప్పటికీ రెండు నెలల వ్యవధిలోనే ఒక నర్సింగ్ ఆఫీసర్, ఒక వైద్యురాలిపై అత్యాచార ఘటనలు తనను కలిసి వేసిందని, ఈ రోజు రాఖీ పండుగ జరుపుకోకుండా వారికి అంకితం ఇస్తున్నానని వెల్లడించా రు.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో నర్సింగ్ సూపరింటెండెంట్(గ్రేడ్-2)గా పనిచేస్తున్న పోగుల శోభ అత్యాచార ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని, నర్సింగ్ ఆఫీసర్ చిత్ర పటాలకు దవాఖానలోని తన చాంబర్లో పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ నవీన,డాక్టర్ రవిప్రవీణ్రెడ్డి,డాక్టర్ అశోక్, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల, ఏడీ షమీం సిబ్బంది పాల్గొన్నారు.