కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మిపై సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎక్స్అఫీషియో సభ్యుడితో కలిపి మొత్తం 37 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన కౌన్సిలర్లు ఎవరూ సమావేశానికి హాజరుకాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రిసైడింగ్ అధికారి డీ మధు ప్రకటించారు. దీంతో యథావిధిగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి కొనసాగనున్నట్టు ప్రిసైడింగ్ అధికారి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టీ శేషాంజన్‌స్వామి, తహసీల్దార్ డీ పుల్లయ్య పాల్గొన్నారు. కాగా.. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి.. ‘నమస్తే’తో మాట్లాడారు. నిజాయితీ, ధర్మం గెలిచిందని, కొంతమంది ప్రలోభాలకు లొంగి, పదవీ వ్యామోహంతో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, కానీ కౌన్సిలర్లు తనవైపు ఉం డటం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని పే ర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కొ త్తగూడెం మున్సిపాలి అభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని చెప్పారు.