Kanti Velugu | ఆర్థిక వ్యవస్థకు ఆత్మరక్ష కంటి వెలుగు.. కేసీఆర్ ముందు చూపుతో అంధత్వ రహిత రాష్ట్రం దిశగా తెలంగాణ
Kanti Velugu | కంటి సమస్యలు ప్రత్యక్ష్యంగా మనిషికే కాదు.. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ నష్టదాయకమేనని ఐక్యరాజ్య సమితి గుర్తింపుపొందిన ప్రఖ్యాత సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ)’ తాజాగా వెల్లడించింది.
- ఆర్థిక వ్యవస్థకు ఆత్మరక్ష.. కంటివెలుగు
- కంటివెలుగుతో అంధత్వరహిత రాష్ట్రం దిశగాతెలంగాణ
- నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు
- దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం
- ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ తాజా అధ్యయనంలో వెల్లడి
- ఐదేండ్ల కిందటే సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్
- ఉత్పాదకత పెరిగి.. జీఎస్డీపీ, తలసరిలో రికార్డులు
- ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా ‘కంటి వెలుగు’ రికార్డు
కంటి సమస్యలు ప్రత్యక్ష్యంగా మనిషికే కాదు.. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ నష్టదాయకమేనని ఐక్యరాజ్య సమితి గుర్తింపుపొందిన ప్రఖ్యాత సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ)’ తాజాగా వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేండ్ల క్రితమే గుర్తించారు. ‘కంటి వెలుగు’ పేరిట బృహత్తర మిషన్‌కు అంకురార్పణ చేసి.. అంధత్వరహిత తెలంగాణకు బాటలు వేశారు. తద్వారా పౌరుల కంటి సమస్యలకు చెక్ పెట్టి.. వారి ఉత్పాదకత శక్తిని పెంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 ( (స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ): నివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను ని ర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో దాదాపు ఏడు కోట్లమంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పింది. ప్రజల్లో నివారించగల అంధత్వ సమస్యలను గుర్తించి, చికిత్స అందించడంలో ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.
ముందే గుర్తించిన సీఎం కేసీఆర్
నివారింపడానికి వీలున్న కంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘కంటివెలుగు’ పేరుతో 2018 ఆగస్టు 15న ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా తొలి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 44 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసింది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించిన రెండో విడతలో 1.6 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చింది. రెండు విడతల్లో లక్షలాది మందికి ఆపరేషన్లు చేసింది. దేశంలో ప్రజలందరికీ మూకుమ్మడిగా, ఒక ఉద్యమంలా కంటి పరీక్షలు నిర్వహించటం తెలంగాణలోనే మొదలైంది. ఇలాంటి కార్యక్రమాల్లో కంటివెలుగు పథకమే మొదటిది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబ్బురపడి.. ఢిల్లీలో కంటివెలుగును నిర్వహిస్తామని ప్రకటించారు.
జీఎస్డీపీ, తలసరిలో రికార్డులు
‘కంటి వెలుగు’ మిషన్‌తో రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల కంటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా ఈ పథకంతో ఉద్యోగులు, కార్మికులకు మేలు చేకూరింది. తద్వారా ఉత్పాదకత కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. ఫలితంగా జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అతితక్కువ సమయంలోనే కొత్త రికార్డులను నమోదు చేసింది. ఎలాంటి కంటి సమస్యలు లేకపోతే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడటం తప్పుతుంది. దీంతో ఉత్సాదకత పెరిగి.. అది ఆర్థికవ్యవస్థ వృద్ధిలో ప్రతిఫలిస్తుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

