Deepti Sharma : అంతర్జాతీయ క్రికెట్లో భారత మహిళల జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది. బర్మింగ్హమ్లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు తీసిన ఈ ఆల్‌రౌండర్ .. 166 వికెట్లతో థాయ్‌లాండ్ బౌలర్ థిపట్చా పుథ్తవాంగ్(Thipatcha Putthawong) రికార్డును బద్ధలు కొట్టింది.
నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకమవుతున్న దీప్తి శర్మ మరో రికార్డు పట్టేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్లతో మెరిసిన దీప్తి.. అత్యధిక వికెట్ల రికార్డు సొంతం చేసుకుంది. పాక్ టాపార్డర్‌ను కూల్చి.. భారత్‌కు అదినూ విజయాన్ని కట్టబెట్టిన తను..అంతర్జాతీయ టీ20ల్లో 166 వికెట్లతో అగ్రస్థానం దక్కించుకుంది.
Most wickets in women’s T20Is
◾ 166 – Deepti Sharma 🇮🇳
◾ 165 – Thipatcha Putthawong 🇹🇭
◾ 160 – Henriette Ishimwe 🇷🇼
◾ 152 – Megan Schutt 🇦🇺
◾ 148 – Onnicha Kamchomphu 🇹🇭 pic.twitter.com/bG6rYaATmP— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2026
ప్రస్తుతానికి థాయ్‌లాండ్ బౌలర్ థిపట్చా పుథ్తవాంగ్ రెండో స్థానంలో ఉంది. 160 వికెట్లతో రువాండా క్రికెటర్ హెన్రియెట్టె ఇషిమ్వే, మేగన్ షట్(ఆస్ట్రేలియా) 152 వికెట్లతో, ఒన్నిచా కంచోంపు(థాయ్‌లాండ్) 148 వికెట్లు వరసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.