Schools Reopen | అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెన్ రోజు క్లాస్రూంలో ఒంటరిగా పదో తరగతి విద్యార్థిని
Schools Reopen | వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది.
Schools Reopen | వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరయ్యారు. కొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరవ్వగా.. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్లోని బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు వచ్చింది. తోటి క్లాస్మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు అశుభంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న (బుధవారం), 19న (శుక్రవారం) ప్రారంభించేందుకు నిర్ణయించాయి.

Schools Reopen6

Schools Reopen5

Schools Reopen4

Schools Reopen3

Schools Reopen2

Schools Reopen10
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

