INDA vs SLA : ఐపీఎల్ 19వ సీజన్లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ(21) భారత జెర్సీతో మాత్రం విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేస్తాడనుకుంటే సులువుగా వికెట్ ఇచ్చేశాడీ హిట్టర్. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(11) సైతం డగౌట్ చేరడంతో పవర్ ప్లేలోనే టీమిండియా ఏ రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది.
ముక్కోణపు సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత ఏ జట్టుకు శుభారంభం దక్కలేదు. శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేసి భారీ స్కోరందిస్తారనుకుంటే ఓపెనర్లు తేలిపోయారు. ఐపీఎల్లో రికార్డు శతకంతో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(21), మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్ సింగ్(11)లు విఫలమయ్యారు. తన మార్క్ విధ్వంసంతో చెలరేగాలనుకున్న వైభవ్‌ను సమన్ అరాచిగే ఔట్ చేశాడు.
🚨 Vaibhav Sooryavanshi dismissed for 21 (14) against Sri Lanka.
14 (12) vs SL
44 (22) vs AFG
21 (14) vs SLHe scored only 79 runs in 3 innings in this series and got out while playing lofted shots.
He needs to have patience and learn to play grounded shots; otherwise, he… pic.twitter.com/I6yaOBkpmT
— Indian Cricket Ministry (@ICM_News45) June 15, 2026
కాసేపటికే షిరాజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వెనుదిరగడంతో వద్ద భారత ఏ జట్టు 39 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ(13), రుతురాజ్ గైక్వాడ్(23)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 13 ఓవర్లకు స్కోర్ 70-2.