Raghava Lawrence | అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చే కఠిన హృదయం కాదు నాది : రాఘవ లారెన్స్
Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్ (Choreographer), నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తనపై జరుగుతున్న ఓ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజలను కుక్కలతో పోల్చాడని సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Raghava Lawrence : ప్రముఖ కొరియోగ్రాఫర్ (Choreographer), నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తనపై జరుగుతున్న ఓ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజలను కుక్కలతో పోల్చాడని సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు విషయం ఏమిటో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇటీవల రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే తన రాజకీయ ప్రయాణం మొదలుపెడతానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆయన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇదే సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారంటూ ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఈ వివాదంపై లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ‘అందరికీ నమస్కారం. నా ఇటీవలి ప్రెస్ మీట్‌కు సంబంధించి ఒక అపోహను నివృత్తి చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అలాంటిది నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం’ అని చెప్పారు.
తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ.. ‘మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు, అక్కడి పరిసరాలను, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాను. అంతేగానీ నేను ఎంతో గౌరవించే, అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడా’ అన్నారు. దయచేసి అందరూ ఆ పూర్తి వీడియోను చూసి, తాను నిజంగా ఏం చెప్పానో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన వివరణకు మద్దతుగా అసలు వీడియోను కూడా తన పోస్టులో పంచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

