సుబేదారి, జూన్ 15 : కల్తీ మిరప పొడి బస్తాలను తరలిస్తున్న లారీని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకొన్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాల ప్రకారం.. హనుమకొండ కాకతీయ కాలనీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మిర్చి తొడిమలు, వడ్ల తౌడుతో కల్తీ మిరప పొడిని తయారు చేసి ఎనుమాముల మార్కెట్ సమీపంలోని మల్లేశ్వర కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాడు.
10 లక్షల విలువగల 550 బస్తాలను లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు చేయించగా కల్తీ పౌడర్‌గా నిర్ధారణ అయ్యింది. దీనిని ధనియాల పౌడర్‌లో కలిపి చిల్లీ పౌడర్‌గా విక్రయిస్తారని విచారణలో తేలింది. కల్తీ పౌడర్ తయారుచేసిన శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్టు అడిషనల్ డీసీపీ తెలిపారు.