కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అదనపు మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కళాశాలలోని ఖాళీగా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 29వ తేదీ సాయింత్రం 5 గంటల నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గత విడత కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా.. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.