Kalki 2898 AD | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న కల్కి ఏడీ 2898 సినిమా స్పెషల్ షోలు వేసుకునేందుకు రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు అనుమతులు ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రాష్ట్ర హోంశాఖను కోరింది. ఐదు షోలు వేసేందుకు, టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకూ హోంశాఖ వారికి అనుమతులు ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది.