హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం విచారణ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు తొలిసారి పెంచిన నెల రోజుల గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో మరో రెండునెలలపాటు కమిషన్ గడువు పొడిగిస్తూ నీటిపారుదలశాఖ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ వ్యవహారంలో విచారణ జరిపేందుకు కాంగ్రె స్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యా యమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్మాణ ఏజెన్సీలు, అందులో భాగస్వాములైన ఇంజినీర్లను, సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ అధికారులను విచారించింది.