ధర్మారం/రామడుగు, ఏప్రిల్ 7 : కాళేశ్వరం జలాలు ఎదురెక్కి వస్తున్నాయి. ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు గోదావరి జలాలు ఎత్తిపోతలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం నంది పంప్‌హౌస్‌లోని 1, 7వ నంబర్ల మోటర్ల ద్వారా ఒకో మోటర్తో 3,150 క్యూసెకుల చొప్పున 6,300 క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలించి, అక్కడి 1, 2వ మోటర్ల ద్వారా అంతే పరిమాణంలో ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువకు, అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.