హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పచ్చని ప్రపంచం కోసం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యర్థి అన్నారు. దేశంలో యువ పార్లమెంటేరియన్‌గా గ్రీన్ చాలెంజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు పొందిన ఎంపీ సంతోష్‌కుమార్ ప్రకృతి పరిక్షణ కోసం, భవిష్యత్తు తరా ల బాగు కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం హైదరాబాద్ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి కైలాశ్ గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నేలను, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుందని, ఆ ప్రయ త్నం నిరంతరం చేస్తున్న సంతోష్‌కుమార్ అభినందనీయుడని ప్రశంసించారు. గ్రీన్ చాలెంజ్ మొదలైనప్పటి నుంచి దేశ, విదేశాల్లోని ప్రముఖులందరితో మొక్కలు నాటిస్తూ గ్రీన్ ఉద్యమాన్ని సృష్టించారని కొనియాడారు. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్ 6.0’ ప్రారంభంలోనే కైలాశ్ సత్యర్థి లాంటి గొప్ప వ్యక్తి మొకలు నాటడం చాలా ఆనందం కలిగిస్తుందని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హకుల ఉద్యమకారులందరికి ‘గ్రీన్ చాలెంజ్’ చేరువవుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ ‘వృక్షవేదం’, ‘హరితహాసం’ పుస్తకాలను కైలాశ్ సత్యార్థికి అందించి, సతరించారు. ఈ కార్యక్రమంలో ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు రాఘవ, కరుణాకర్‌రెడ్డి, బచ్పన్ బచావో ఆందోళన రాష్ట్ర కో ఆర్డినేటర్ చందనారాజ్ తదితరులు పాల్గొన్నారు.