జీవో 97ను రద్దు చేయాలి
జీవో 97ను రద్దు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్‌తోనే ఉంచాలని, పాలిటెక్నిక్‌ను లేబర్, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్‌లోకి తీసుకురావొద్దని సూచించారు.
- పాలిటెక్నిక్ విద్యార్థులకు మేలు చేయాలి
- సీఎంను కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 29: జీవో 97ను రద్దు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్‌తోనే ఉంచాలని, పాలిటెక్నిక్‌ను లేబర్, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్‌లోకి తీసుకురావొద్దని సూచించారు.
ఇంజినీర్ విద్యార్థులం లేబర్ డిపార్ట్‌మెంటులోకి పోతామా? అనే అపోహలు వచ్చాయని అన్నారు. స్కిల్ యూనివర్సిటీకి పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేసి, మరికొన్ని స్కిల్స్ నేర్పిస్తే వెంటనే వారికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ఒక ఆలోచన చేసిందని, ఇది మంచి ఆలోచనే అయినప్పటికీ.. ఇంజినీరింగ్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేయడానికి విద్యార్థులు ఒప్పుకోవడం లేదని తెలిపారు. వారి ఆలోచన కూడా సరైనదేనని స్పష్టంచేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవోను రద్దు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

