వరంగల్ లీగల్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్ పర్యటనకు వెళ్తారు. దేశంలోనే ప్రత్యేక న్యాయస్థానాల భవన సముదాయంగా ప్రసిద్ధి పొందిన వరంగల్-హనుమకొండ జిల్లా కోర్టును సందర్శిస్తారు. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పర్యటన వివరాలను జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
జిల్లా కోర్టు భవన సముదాయం లో ఉన్న ప్రత్యేక పోక్సో, ఫ్యామిలీ, ఇతర కోర్టులను ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కోర్టులోని న్యాయమూర్తులతో న్యాయ పరిపాలన అంశాలపై సమీ క్ష నిర్వహించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో కోర్టులోని ఉద్యోగులకు ఆదివారం సెలవును రద్దుచేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హకుల ఉద్యమ కారుడు కైలాష్ సత్యార్థి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం కానున్నారు.