హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ పీ శ్యాంకోషి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని ఆయన శుక్రవారం వరకు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్ కోల్‌కతాకు బదిలీపై వెళ్లారు.
కొత్త చీఫ్ జస్టిస్‌గా నియమితులైన త్రిపుర హైకోర్టు జస్టిస్ ఏకే సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అప్పటివరకు అంటే రెండు రోజులపాటు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యాం కోషి వ్యవహరించనున్నారు.