హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ నవీన్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జస్టిస్ భూయాన్ శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరిస్తారు. శుక్రవారం నుంచే జస్టిస్ నవీన్‌రావు నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీందర్ కశ్యప్ జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. శుక్రవారమే జస్టిస్ నవీన్‌రావు పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా అభినంద్ కుమార్ షావిలి బాధ్యతలు నిర్వహిస్తారని నోటిఫికేషన్లో తెలిపారు.
కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో పీ మురళీధర్‌రావు, విమల దంపతులకు జస్టిస్ నవీన్‌రావు జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాక, 1986లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013 ఏప్రిల్ 12న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టులో అనేక పాలనా సంసరణలకు శ్రీకారం చుట్టారు. రైతులకు న్యాయపరమైన హకుల కోసం అన్ని జిల్లాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అన్ని జిల్లాల్లోనూ కోర్టు ప్రాంగణాలు ఏర్పాటయ్యేందుకు కృషిచేశారు. ఆయన శుక్రవారమే తాతాలిక ప్రధాన న్యామయూర్తిగా బాధ్యతలు స్వీకరించి, అదేరోజు పదవీ విమరణ చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయనకు మొదటికోర్టు హాల్లో న్యాయమూర్తులంతా (పుల్ కోర్టు) వీడోలు చెప్పనున్నారు. హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరధే కొద్దిరోజుల్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.