హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.