హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డి (రిటైర్డు), సభ్యులుగా ప్రదీప్‌కుమార్‌రెడ్డి పల్లె (అడ్వకేట్, జ్యూడిషియల్ సభ్యుడు), రిటైర్డు ఐఏఎస్ అధికారి చిత్రా రామచంద్రన్ (టెక్నికల్/అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు) శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరికి ‘రెరా’ అథారిటీ చైర్మన్ ఎన్ సత్యనారాయణ, సభ్యులు కే శ్రీనివాస్‌రావు, జే లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛాలిచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. వీరిని 7న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.