శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 16, 2020 , 01:23:09

శ్రీశైలానికి పెరుగుతున్న వరద

శ్రీశైలానికి పెరుగుతున్న వరద

  • మరో మూడురోజులుగా ప్రవాహం
  • జూరాలలో ఎనిమిది గేట్లు ఎత్తివేత

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవా హం మొదలైంది. బుధవారం సాయంత్రానికి జూరాల నుంచి 42,644 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2,876 క్యుసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 816.40 అడుగులుగా ఉన్నది. మరో మూడ్రోజులపాటు శ్రీశైలానికి వరద కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. జూరాలకు ప్రవాహం పెరగడం తో బుధవారం ఎనిమిది గేట్లు ఎత్తి 42,644 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 67,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 67,534 క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టికి 27,658 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 46,130 క్యూసెక్కులు, నారాయణపురకు 43,131క్యూసెక్కులు, 45,995 అవుట్‌ఫ్లో నమోదవుతున్నది.  

గోదావరి బేసిన్‌లో..

లోయర్‌మానేరు రిజర్వాయర్‌ నుంచి కాకతీయ కాలువ పరిధిలో చెరువులు నింపేందుకు, ఆయకట్టు సాగుకోసం బుధవారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఉదయం 500 క్యూసెక్కులు విడుదల చేసి క్రమంగా 5 వేల క్యూసెక్కులకు పెంచారు.  ఎల్‌ఎండీ నుంచి స్టేజ్‌-1 పరిధిలో 5 లక్షలు, స్టేజ్‌-2 పరిధిలోని 4 లక్షల ఎకరాల ఆయకట్టు, 1,700 చెరువులు, కుంటలను నింపనున్నారు. 


logo