శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:26:26

17 నుంచి జూనియర్‌ కాలేజీలు!

17 నుంచి జూనియర్‌ కాలేజీలు!

ఆన్‌లైన్‌లో బోధన.. ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలలో 2020-21 విద్యాసంవత్సరాన్ని ఈ నెల 17 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తుది ఆమోదంతో ఒకటి రెండు రోజులలో విద్యాశాఖ నుంచి జీవో విడుదల కావాల్సి ఉందని, ఆ తర్వాతే ఆన్‌లైన్‌ బోధన ప్రక్రియ ప్రారంభమౌతుందని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.


logo