ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న నాయకుడు ఇలా పట్టుతప్పి మాట్లాడటం వారి సంస్కారస్థాయికి సూచికగా మిగులుతుంది. మహిళా నాయకురాలిని కించపరుస్తూ మాట్లాడే వ్యక్తి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం కంటే దారుణం మరొకటి లేదు. బండి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను.
-జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్