Judges Transfer | పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను తెలంగాణ హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీలను బదిలీ చేసింది. వీరంతా ఈ నెల 26న బదిలీ స్థానాల్లో బాధ్యతలను స్వీకరించాలని సూచించింది. ఈ లోగా విచారణ పూర్తి చేసి తీర్పులను రిజర్వు చేసిన కేసుల్లో తీర్పులు వెలువరించాలని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.