హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఫతేమైదాన్ క్లబ్లో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కేవీ కృష్ణయ్య, కృష్ణయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రెండు రాష్ట్రాల యాదవ ఉద్యోగుల ప్రతినిధులు, వారి సామాజిక వర్గం అభివృద్ధి, ఉద్యోగులు పరస్పర సహాకారం, విద్యార్థులకు ఉచిత గ్రూప్ కోచింగ్ సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ యాదవ ఎంప్లాయిస్ సొసైటీ, ఆంధ్రా యాదవ్ ఎంప్లాయిస్ సొసైటీతోపాటు భారత్ స్థాయి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారు.