వలిగొండ/ భువనగిరి కలెక్టరేట్, జూలై 30: యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పలువురు నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండలాధ్యక్షుడు ఎల్లంల జంగయ్యయాదవ్, మాజీ అధ్యక్షుడు కోట స్వామి, నమాత్‌పల్లి సర్పంచ్ ఎల్ంలల శాలినీ, నందనం ఎంపీటీసీ మట్ట పారిజాతతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. భువనగిరి, వలిగొండ మండలాల్లోని పలు గ్రామాల నుంచి 250 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరందరికీ అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.