హైదరాబాద్ : వైఎస్సార్టీపీ(YSRTP) పార్టీ నుంచి పలువురు నేతలు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. వైఎస్సార్టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్వాగతం తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. నమ్మివస్తే తమను నట్టేట ముంచిన షర్మిలపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావించి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.
గట్టు రాంచందర్ రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి హరీశ్ రావు