నల్లగొండ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పాలన కొనసాగిస్తుందని అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 50మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే గులబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశమంతా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పార్టీ నిరంతరం అండగా తోడుగా ఉంటుందన్నారు. సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 70 ఏండ్ల పాలన ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతులలేమితో కటకటలాడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయని వీటన్నింటికి ఆ రెండు పార్టీలు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, స్థానిక సర్పంచ్ గంగిడి కొండల్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, రమావత్ మోహన్ కృష్ణ, గోసుల అనంతగిరి, బుయ్యా మహేష్, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.