సంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి చింతల గట్టు సుధీ, కోహిర్ మాజీ ఎంపీపీ జంపాల అనిత ముదిరాజ్, తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) నియోజకవర్గం అధ్యక్షుడు సంపత్, నాయకులు కృష్ణారెడ్డి, వార్డు మెంబర్ రవికుమార్, ప్రణయ్, సునీల్, కన్న తదితరులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి మంత్రి గులాబీఆ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం లభివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.