తరచూ సెలవులు పెడితే ఎలా?.. వైద్య సిబ్బందిపై జోగుళాంబ గద్వాల కలెక్టర్ ఆగ్రహం
తరచూ సెలువులు పెడుతుంటే రోగులకు వైద్య సేవ లు ఎలా అందిస్తారు.. ? అంటూ వైధ్యాదికారులు, సిబ్బందిపై జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా మండిపడ్డారు.
- రోగులకు వైద్య సేవలు ఎవరు అందిస్తారు..?
అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 28 : తరచూ సెలువులు పెడుతుంటే రోగులకు వైద్య సేవ లు ఎలా అందిస్తారు.. ? అంటూ వైధ్యాదికారులు, సిబ్బందిపై జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా మండిపడ్డారు. శుక్రవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల దవాఖానను ఆయన తనిఖీ చేసి రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ ఓపీ సంఖ్య ఆశించిన రీతిలో ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రతిరోజూ రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
అలంపూర్ చౌరస్తాలో వంద పడకల దవాఖానని ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోగులకు వైద్యం అందించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా వారికి అన్ని రకాల వైద్యసేవలు అందించాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది ఉన్నప్పటికీ దవాఖాన ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ధరణీషా తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

