BRAOU | బంజారాహిల్స్, అక్టోబర్ 24 : డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్వింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. 2024, 2025 బ్యాచ్‌లలో ఉత్తీర్ణులయిన విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ.పుష్పా చక్రపాణి, ప్రొ.రవీంద్రనాథ్ సొలమన్, డా.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.