అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్
ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని తెలిపారు.
- ప్రతి మార్చిలోగా ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం
- జూన్ 2లోగా నోటిఫికేషన్.. డిసెంబర్ 9లోగా నియామకాలు
- రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని తెలిపారు. జూన్ 2వ తేదీలోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ 9వ తేదీలోగా నియామకాల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత (సీఎస్సార్)లో భాగంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో అర్హులకు లక్ష చొప్పున ఆర్థికసహాయం అందించే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం’ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, నిరుద్యోగుల సమస్యలు పరిషరించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పారు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించినవారికి మెయిన్స్ కోచింగ్ స్టడీ మెటీరియల్, హాస్టల్ ఖర్చుల కోసం రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతిఏటా రాష్ట్రం నుంచి సివిల్స్‌కు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, వీరిలో సుమారు 250-300 మంది మెయిన్స్‌కు అర్హత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2023లో రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హరర వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ఎంపీలు రామసహాయం రఘురామ్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కోరెం కనకయ్య, వివేక్ వెంకటస్వామి, పాయం వెంకటేశ్వర్లు, కే ప్రేమసాగర్‌రావు, మకన్ సింగ్‌రాజ్ ఠాకూర్, మట్టా రాగమయి, కనీస వేతనాల కమిషన్ చైర్మన్ జనక్‌ప్రసాద్, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సీఎంవో సెక్రటరీ మాణిక్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

