TG EAPCET | హైదరాబాద్ : ఈ నెల 11న టీజీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈఏపీ సెట్ ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్, ఈ నెల 2,3,4 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 94 శాతం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 93 శాతం వరకు హాజరు నమోదైంది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.