హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ పరీక్షాకేంద్రాలను పెంచాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దరఖాస్తులు 3 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 15 నుంచి 20 సెం టర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అంతరాయం లేని విద్యుత్తు, ఇంటర్నెట్, జనరేటర్ వంటి సౌకర్యాలున్న పరీక్షాకేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. నిరుడు ఎంసెట్‌ను తెలంగాణ, ఏపీలో కలిపి 108 పరీక్షాకేంద్రాల్లో నిర్వహించగా, ఈ ఏడాది 120కిపైగా సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎంసెట్ పరీక్షలను మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.
నేడు యూజీసీ నెట్ ఫలితాలు విడుదల
యూజీసీ నెట్ ఫలితాలు గురువారం వి డుదల కానున్నాయి. ఫలితాలు ugcnet.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. యూజీసీ నెట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది.