హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలోని పలువురు ప్రొఫెసర్లు పాఠాలు బోధించకుండా పైరవీలతో నాన్‌టీచింగ్ పోస్టులకు పరిమితమయ్యారని వర్సిటీ నాన్‌టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఎన్టీఈఏ)ఆరోపించింది. యూనివర్సిటీలో సుమారు 40 మంది ప్రొఫెసర్లు నాన్‌టీచింగ్ పోస్టుల్లో కొనసాగుతున్నట్టు పేర్కొన్నది.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చాన్స్‌లర్(గవర్నర్)కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది.. ఎవరి పోస్టుల్లో వారు కొనసాగేలా చూడాలని, వెంటనే నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేసింది.