హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఈ నెల 31న జేఎన్టీయూ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పార్ట్-టైమ్ పీజీ ప్రోగ్రామ్స్ 2023-24 (పీటీపీజీ) కింద ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు జేఎన్టీయూ అడ్మిషన్ డైరెక్టర్ తెలిపారు.
ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం, వాటర్ రిసోర్స్ ఇంజినీరింగ్), ఎంబీఏ (హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఫీజు రూ.1000, ప్రతి సెమిస్టర్‌కు రూ.25 వేల చొప్పున ట్యూషన్ ఫీజుగా నిర్ణయించామని తెలిపారు. పూర్తి వివరాల కోసం జేఎన్టీయూ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.