హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): 2023 -24 విద్యాసంవత్సరంలో వృత్తివిద్య కాలేజీల అఫిలియేషన్ల (అనుబంధ గుర్తింపు) ప్రక్రియను జేఎన్టీయూ ప్రారంభించింది. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, కోర్సుల మూసివేతకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లకు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ సర్క్యులర్ జారీచేశారు. ఎన్వోసీలకు యాజమాన్యాలు, విద్యాసంస్థల సొసైటీల తీర్మానం, మినిట్స్‌ను జతపర్చాలన్నారు.